HNK: శాయంపేట మండలం కటాక్షపూర్‌లో భారీ వర్షాల కారణంగా చెరువులోకి వరద నీరు చేరి, బ్రిడ్జ్‌పై నీరు ప్రమాదకరంగా ప్రవహించింది. బ్రిడ్జ్‌పై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై సీఐ సంతోష్ గురువారం స్పందించి, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో వాహన రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. వాహనదారులు సీఐ సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.