ఆఫ్గానిస్తాన్ మంత్రి ముత్తాకీ భారత్ పర్యటనకు వస్తున్న వేళ కొత్త అంశం తెరపైకి వచ్చింది. రెండు దేశాల ఒప్పందాల సమయంలో ఇరు దేశాల జెండాలను టేబుల్‌పై ఉంచాలి. కానీ తాలిబాన్ జెండాను భారత్ అధికారికంగా గుర్తించలేదు. ఈ జెండాపై ఇస్లామిక్ విశ్వాసానికి సంబంధించిన పదాలు ఉన్నందున అధికార హోదా ఇవ్వలేదు. ఈ తరుణంలో జెండాను ప్రదర్శిస్తారా? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.