AP: 15వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. పంచాయతీరాజ్ సంస్థలకు రూ.410 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 13 జిల్లా పరిషత్తులు, 650 మండల పరిషత్తులకు లబ్ధి చేకూరనుంది. 13,092 పంచాయతీలకు లబ్ధి పోందుతాయి. ఈ నిధులు ఆయా స్థానిక సంస్థలు తమ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సేవలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.