HYD: గ్రేటర్ వ్యాప్తంగా తలెత్తుతున్న సమస్యలను ఫిర్యాదు చేస్తే సత్వర పరిష్కారం దొరకడం లేదని నగర ప్రజలు వాపోతున్నారు. గార్బేజీ సమస్య, చెరువుల కలుషితం, గుంతల మయంగా రోడ్లు, అనేకచోట్ల నిర్మాణ వ్యర్ధాల డంపింగ్ సమస్యలు ఉన్నట్లు తెలిపారు. X, మై జీహెచ్ఎంసీ యాప్, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నప్పటికీ, ఫిర్యాదు చేసిన నెలల తర్వాత స్పందిస్తున్నారన్నారు.