SKLM: స్థానిక అభ్యుదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి సాయికుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 18 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నాయని తెలిపారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివిన 18–30 ఏళ్ల గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.