TG: 6 గ్యారెంటీల్లాగే 42 శాతం BC రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. 55 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్.. ఏనాడైనా బీసీల కోసం పనిచేసిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో కొట్లాడాలన్నారు. కలిసి వచ్చేందుకు తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధమన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు ఆపాలన్నారు.