సత్యసాయి: గోరంట్ల మండల కేంద్రంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు.