CTR: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (AIMSR)లో సైకియాట్రి విభాగం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ మేరకు “కాటాస్ట్రోఫీలు, అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సేవల ప్రాముఖ్యత” అనే థీమ్‌తో కార్యక్రమం జరిగింది.