BHNG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, BRS జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డును గురువారం వారు ఆవిష్కరించారు. రోడ్డు వెంట షాపుల్లో పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు.