CTR: పుంగనూరు మండలం పరిధిలోని సింగిరిగుంట సచివాలయంలో గురువారం MPP రాజశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల హాజరు పట్టిక, రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయ ఉద్యోగులకు పలు సూచనలు జారీ చేశారు.