TG: రాష్ట్రంలో దశల వారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మొదటి దశలో రూ.10,986 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఇందుకు వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు 2 వరుసల హ్యామ్ రోడ్లు.. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి 4 వరుసల రోడ్ల నిర్మిస్తామన్నారు.