మేడ్చల్: కీసర పరిసర ప్రాంతాలలో ఈ 2025 ఏడాదిలో ఆగస్టు నెలతో పోలిస్తే భూగర్భ జలాలు పెరిగినట్లుగా తెలంగాణ రాష్ట్ర భూగర్భ జల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొన్నిచోట్ల 1.12, 1.8, 3.4 మీటర్ల లోతులో భూగర్భ జలం అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు నెలలో అనేకచోట్ల 4 మీటర్లకు లోపే భూగర్భజలం లభ్యమయ్యేదని, ఈ రికార్డులు నమోదు అయినట్లు వివరించారు.