NLG: నార్కట్పల్లి మండలం ఔరవాణి గ్రామ కాంగ్రెస్, సీపీఎం పార్టీలకు చెందిన 15 కుటుంబాలు గురువారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ మాజీ ఛైర్మెన్ బండ నరేందర్ రెడ్డిల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అలాగే నకిరేకల్ మండలం తాటికల్కు చెందిన జక్కలి శ్రీశైలం, కట్టంగూరు మండలం పామనగుండ్లకు చెందిన బొందు సైదులు గులాబీ కండువా కప్పుకున్నారు.