KMR: అక్టోబర్ 7న KMR జిల్లా కేంద్రంలో నిర్వహించబడిన అండర్ 19 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కళ్లెం సౌందర్య (బైపీసీ మొదటి సంవత్సరం), నేనావత్ చరణ్ (బైపీసీ ద్వితీయ సంవత్సరం) ఎంపికయ్యారు. గురువారం కళాశాల ప్రిన్సిపల్ సింగం శ్రీనివాస్, తోటి విద్యార్థినీ విద్యార్థులు అభినందనలు తెలిపారు.