VSP: కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి ప్రభుత్వం అందిస్తున్న పోషక పదార్థాలు తీసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆనందపురం మండల కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన 8 వ రాష్ట్రీయ పోషక మాసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుట్టబోయే బిడ్డకు కావాల్సిన పోషకాలను శాస్త్రీయంగా ఎంపిక చేసి ఇస్తున్నామని పేర్కొన్నారు.