కోనసీమ: జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనాని గురువారం అమలాపురం జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. సాలువాతో సత్కరించి, మొక్కను అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణ, అభివృద్ధిపై చర్చించారు.