TG: హైకోర్టు తీర్పు కాపీ చూశాక ప్రభుత్వం తరుపున నిర్ణయం తీసుకుంటామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీలు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నారు. బీసీల నోటికాడ ముద్ద లాక్కుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత గవర్నర్ చేత ఎవరు ఆమోదించనీయట్లేదో అందరికీ తెలుసన్నారు.