VZM: బొండపల్లి మండలంలోని గొట్లాం రైతు సేవా కేంద్రంలో గురువారం పంట కోత ప్రయోగాలపై రైతు సేవా కేంద్రాల ఇన్చార్జిలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. గజపతినగరం సబ్ డివిజన్ ఏడిఏ నిర్మల్ జ్యోతి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పంట కోత ప్రయోగాలు పూర్తి జాగ్రత్తతో నిర్వహించాలన్నారు. ఇందులో మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.