TG: స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో హైకోర్టు వద్ద బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. హైకోర్టు గేట్ నం.4 ఎదుట బీసీ నిరసన చేపట్టాయి. బీసీ నేతలు రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు బీసీ నేతలను అరెస్ట్ చేశారు.