ATP: కూడేరు సీఐ రాజును సస్పెండ్ చేయాలని ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ కండువాలు వేసుకుంటేనే ఫిర్యాదు తీసుకుంటానని చెప్పటం హేయమైన చర్య అని మండిపడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై సీఐ రాజు వేధింపులకు పాల్పడుతున్నారని, మంత్రి పయ్యావులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.