AP: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై చర్చించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. చేపల వేటను కొనసాగిస్తూ.. ఉప్పాడలో 7,193 మత్స్యకారుల కుటుంబాలు ఆధారపడ్డాయన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏటా రూ.20 వేలు ఇస్తున్నామని వెల్లడించారు. ఉప్పాడ సముద్ర రక్షణ గోడ నిర్మిస్తామని పేర్కొన్నారు. రూ.323 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టేందుకు అంగీకరించిందని తెలిపారు.