VZM: ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం సంత వురిటి గ్రామానికి చెందిన బి.వెంకటేశ్వరరావు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ రైల్వే వినియోగదారుల సలహా సంఘం కమిటీ సభ్యుడిగా నియమించబడ్డారు. ఈరోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చేతుల మీదుగా వెంకటేశ్వరరావు నియామక పత్రాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఆయనకు అభినందనలు తెలిపారు.