ATP: ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజు అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో దళితులను అనేక సందర్భాలలో తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. మాస్కు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను వేధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.