KNR: చిగురుమామిడి మండలం, ముల్కనూర్లోని టీజీ మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థిని శ్రీనిధి, రాష్ట్రస్థాయి అండర్-19 ఇంటర్ కాలేజీ కబడ్డీ క్రీడలకు ఎంపికైంది. జిల్లాస్థాయి పోటీల్లో ఆమె కనబరచిన వేగం, చాకచక్యాన్ని గుర్తించి క్రీడా అధికారులు ఈ అవకాశం కల్పించారు. శ్రీనిధి ఎంపిక పాఠశాలకే గర్వకారణమని ప్రిన్సిపాల్ హర్జత్ కౌర్ పేర్కొన్నారు.