AKP: ఒడిస్సాలోని పూరి మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనకాపల్లి టీడీపీ నేత పీలా గోవిందు గురువారం పరిశీలించారు. అమృత పథకం, పట్టణ మంచినీటి, మురుగునీటి ప్రాజెక్టుల అమలు, నిర్మాణాన్ని పరిశీలించారు. వీటి గురించి పూరి మున్సిపల్ శాఖ అధికారులు వివరించారు.