ATP: తాడిపత్రిలో గూడ్స్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కడప నుంచి గుంతకల్లుకు వెళ్తుండగా పుట్లూరు రైల్వే గేట్ వద్దకు చేరుకోగానే రైలులోని సగం బోగీల లింక్ మధ్యలో ఊడిపోయింది. దీంతో ఇంజిన్‌తో పాటు కొన్ని భోగీలు కొంతదూరం వెళ్లాయి. లోకో పైలట్ గమనించి రైలును నిలిపివేశారు. పుట్లూరు రైల్వే గేట్‌ను పూర్తిగా బంద్ చేశారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.