మహబూబ్నగర్ తెలంగాణ కాలనీలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో శునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ కుక్కలు బైకులపై వెళ్లేవారిని వెంబడిస్తుండడంతో, చిన్నారులు బడికి వెళ్లాలంటే జంకుతున్నారు. రోజురోజుకు వాటి సంఖ్య పెరుగుతుండటంతో, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, నివారణ చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
Tags :