NRML: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా సేవలు మరువలేనివని నిర్మల్ టాటా ఇన్సూరెన్స్ సభ్యులు పేర్కొన్నారు.గురువారం జిల్లా కేంద్రంలో రతన్ టాటా ప్రథమ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సాగర్ కాలనీలో గల డవ్ వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టాటా ఇన్సూరెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.