KKD: ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడిలో కూటమి నేతలు, ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ గురువారం జీఎస్టీ 2.0 నూతన స్లాబ్ విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య ప్రభ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ధరలను తగ్గించిందన్నారు. ఈ కొత్త విధానం వల్ల పన్ను భారం తగ్గి, ప్రతి కుటుంబానికి డబ్బులు ఆదా అవుతుందని ఆయన తెలిపారు.