WNP: శ్రీరంగాపురం మండలంలో గురువారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ఉన్నందున, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు ఎస్సై హిమబిందు తెలిపారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు, నామినేషన్ కేంద్రాల నుంచి 100 మీటర్ల పరిధిలో ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని ఆమె చెప్పారు.