KDP: వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, అమీన్ పీర్ పెద్ద దర్గాలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించారు. గురువారం రాత్రి జరిగిన అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డితో కలిసి పూల చాదర్ సమర్పించి, సాంప్రదాయ పద్ధతిలో దర్గాకు గౌరవాలు అందించారు.