NGKL: కల్వకుర్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డు టెక్నాలజీ సెంటర్ను (ACT) కలెక్టర్ సంతోష్ గురువారం సందర్శించారు. సెంటర్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు.