KMR: మద్నూర్ మండల కేంద్రంలోని వేదికలో రైతులకు రాయితీపై శనగ విత్తనాలు పంపిణీ చేశామని గురువారం DAO మోహన్ రెడ్డి అన్నారు. DAO ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు 50 శాతం రాయితీపై శనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఆహార భద్రత మరియు పోషణ మిషన్ స్కీంలో భాగంగా రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.