JN: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని కార్యకర్తలకు దేశాన్ని నిర్దేశం చేశారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.