SKLM: నరసన్నపేట మండలం కొల్లవానిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ శాంతారావు గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతిల వారీగా ఉపాధ్యాయుల సామర్థ్యాలను పరిశీలించి, పలు ప్రశ్నలు వేశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. ప్రతీ ఉపాధ్యాయుడి నిత్య విద్యార్థిగా ఉంటూ బోధిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.