NZB: మోస్రా మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహశీల్దార్ రాజశేఖర్, ఐకేపీ ఏపీఎం గంగాధర్ ప్రారంభించారు. తహశీల్దార్ మాట్లాడుతూ.. ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ ఉన్నారు.