VSP: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అక్టోబర్ 13-15 మధ్య అనంతపురంలో జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. గురువారం పందిమెట్టలో జగదంబ జోన్ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ జరిగింది. అధ్యక్షురాలు K. మణి జెండా ఆవిష్కరించగా, మహిళా హక్కులు, రక్షణ, సమాన అవకాశం, మద్యపాన నిషేధం వంటి అంశాలపై నినాదాలతో ప్రచారం నిర్వహించారు.