E.G: చిత్తూరు జిల్లాలో బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనను కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ చర్యకు వ్యతిరేకంగా గురువారం రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అంబేద్కర్ ఆలోచనలు, స్ఫూర్తితోనే సమానత్వ సమాజ నిర్మాణం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.