SRPT: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదన్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.