అన్నమయ్య: పుల్లంపేట మండలం వద్ద టాస్క్ ఫోర్స్ అధికారులు ఇవాళ ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఒక స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళ్తే SP శ్రీనివాస్, DSP మార్గదర్శకత్వంలో RSI వినోద్‌కుమార్ బృందం కూంబింగ్‌లో భాగంగా రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద నిందితుడిని పట్టుకున్నారు. దుంగలతో పాటు తిరుపతి టాస్క్ ఫోర్స్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.