SRCL: వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. ఇల్లంతకుంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ఆరోగ్య పథకాల లక్ష్యాలు సాధించాలన్నారు. కళాశాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి 100 మీటర్ల దూరంలో సిగరెట్, బీడీ లాంటివి తాగడం నిషేధం అని వివరించాలన్నారు.