SKLM: జలుమూరు మండలం శ్రీముఖలింగం లో ఉన్న శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయ ఈవోగా గురువారం ఏడుకొండలు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆయనకు ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గతంలో విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో బాధ్యతలు చేపడుతూ, పదోన్నతపై జిల్లాకు ఈవోగా వచ్చారు.