TPT: గూడూరు మండల పరిధిలోని కాండ్ర వెందోడు రోడ్డులో ప్రమాదం జరిగింది. ఇందులో భాగంగా బాలాయపల్లి మండలం గొట్టికాడు గ్రామానికి చెందిన జస్వంత్ గూడూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో విధుల్లో పాల్గొనేందుకు బైక్పై వెళ్తుండగా మరో బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో జస్వంత్ మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.