కోనసీమ: పి.గన్నవరం సెంటర్లో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వర్ధంతి వైసీపీ నేత అడ్డగళ్ల సాయిరాం ఆద్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ మాజీ కో ఆర్డినేటర్ మందపాటి కిరణ్ కుమార్ పాల్గొని జక్కంపూడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, సురేష్, ప్రసాద్ పాల్గొన్నారు.