NLG: గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు పౌష్టికాహారం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత అన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్లలో ఇవాళ పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు పౌష్టికాహారంపై ప్రతిజ్ఞ చేశారు. ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరలతో పాటు మొలకెత్తిన ధాన్యాలను తీసుకోవాలని సూచించారు.