NTR: తిరుపతి జిల్లా పద్మావతి గెస్ట్ హౌస్లో 2వ రోజు ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా భక్తుల ఆధ్యాత్మిక నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. భక్తుల సౌకర్యం, సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.