MLG: వెంకటాపురం మండల BRS నాయకులను పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేసి, స్టేషన్కి తరలించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపుమేరకు బస్సు ఛార్జీల పెంపుకు నిరసనగా హైదరాబాద్ వెళ్తున్న తమను అరెస్టు చేసారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా చేస్తున్న నిరసనను అడ్డుకోవడం సరికాదని వారు మండిపడ్డారు. నరభద్రయ్య, కుమార్, రాజేందర్, పాషా, తదితరులున్నారు.