E.G: లాభసాటి వ్యవసాయం, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం నిడదవోలు మండలం సింగవరం గ్రామంలో పర్యటించిన మంత్రి వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా సందర్శించారు. వరి పంట కోత, నూర్పిడి, ధాన్యం తూర్పార పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించి వారి సమస్యలపై, పంట దిగుబడిపై ఆయన ఆరా తీశారు.