HYD: జలమండలి వాటర్ ట్యాంకర్ల అడ్డదారిలో జరిగే సరఫరాను అరికట్టడం కోసం HMWSSB కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. ఆటోమేటిక్ వెహికల్ ట్రాకింగ్ సిస్టం అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా వాహనం ఎక్కడ వరకు వెళ్లింది, ఎప్పుడు వెళ్లింది, బిల్లింగ్ సిస్టం సంబంధించి మొత్తం డిజిటల్ పద్ధతిలో రికార్డు అవుతుంది. అవినీతికి తావుండదన్నారు.