KMM: పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాక ముఖం చాటేసిన వ్యక్తిపై గురువారం రూరల్ PSలో కేసు నమోదైంది. ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన యువతి, ఖమ్మం నగరానికి చెందిన షేక్ సలీం 2020 నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ ప్రేమించిన యువతికి తెలియకుండా ఆగస్టు 14న మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయమై బాధిత యువతి ప్రశ్నిస్తే సలీం కుటుంబీకులు బెదిరించారు. దీంతో ఆమె ఫిర్యాదు చేశారు.